వెదజల్లే పద్ధతి ద్వారా వరి పంట సాగుతో అధిక దిగుబడి, లాభాలు సాధించవచ్చని కామారెడ్డి జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు అనిల్ కుమార్ రెడ్డి, రేవంత్ నాతన్ లు అన్నారు. బుధవారం వారు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డి పేట్ గ్రామ శివారులో, మున్సిపల్ శివారులో రబీ సీజన్లో వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శించారు.