నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తాండలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్చంద సంస్థ, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై గురువర్సన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టి స్వచ్చంద సంస్థ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టి స్వచ్చంద సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ డి. శ్రీనివాస్ మాట్లాడుతూ మన ఆర్థిక నిర్ణయాలను సమర్థవంతంగా తీసుకుని ఆర్థిక సంక్షేమాన్ని సాధించటమే ఆర్థిక అక్షరాస్యత అన్నారు.