కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లిమెంట్ లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మంగళవారం అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమిత్ షా కేంద్రమంత్రి కావడానికి రాజ్యంగమే కారణమన్నారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పి, పదవికి రాజీనామా చేయాలన్నారు.