మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జనవరి 17న ఈ మూవీ దేశ వ్యాప్తంగా రిలీజ్ కాగా పంజాబ్‌లో మాత్రం ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించింది. ఈ క్రమంలో కంగనా రనౌత్ స్పందించారు. పంజాబ్‌లో సినిమాపై నిషేధించడం తనను బాధకు గురి చేసిందని, ఇది మనల్ని ఏకం చేస్తుందా? లేదా? అనే విషయాన్ని సినిమా చూసి తెలుసుకోవాలని చెప్పారు.