చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. సంవత్సర కాలంలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని దద్దమ్మ అని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశిస్తూ మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సంస్కారహీనంగా మాట్లాడితే ఊరుకోబోమన్నారు.