బోయినపల్లి మండల కాంగ్రెస్ నేతలు కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో ఆయనను మంగళవారం కలిశారు. వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసినట్లు మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి తెలియజేశారు. కొదురుపాక గ్రామంలో జరగనున్న క్రికెట్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరుకావాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేశారు. బీసీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్, మాజీ జెడ్పిటిసి లక్ష్మీపతి గౌడ్, వంశి గౌడ్ పాల్గొన్నారు.