కరీంనగర్ బస్టాండ్లో ధర్మారం మండలానికి చెందిన ఓ మహిళవి 6 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. శుక్రవారం సాయంత్రం ధర్మారం నుంచి ఆటోలో కరీంనగర్ బస్టాండ్ కు వచ్చి హైదరాబాద్ బస్సు ఎక్కి కూర్చొని సంచి చూడగా జిప్ తెరిచి ఉంది. అనుమానంతో లోపల చూస్తే బంగారు ఆభరణాలు, డబ్బులు లేవు. పోలీసులు బస్టాండు వచ్చి సీసీ కెమెరాల్లో చూడగా ఓ మహిళ బాధితురాలి బంగారు ఆభరణాలు, నగదు అపహరించినట్లు గుర్తించి కేసు నమోదు చేసుకున్నారు.