రూ. 5 వేల ఆర్థిక సాయం అందించిన విప్

67చూసినవారు
రూ. 5 వేల ఆర్థిక సాయం అందించిన విప్
పెగడపల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన రాజనర్సయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్