హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు మంగళవారం ఆందోళన బాట పట్టారు. తమకు ఎన్నికల సమయంలో రూ. 18 వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ ఆశా కార్యకర్తల పై పోలీసుల లాఠీ చార్జిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు.