హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామంలో నేతన్న విగ్రహ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చేనేత కార్మికుల ఆకలి చావులు అరికట్టేలా ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకోవాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. కులమే బలం బలమే కులం అని చెప్పుకుంటున్న నాయకులు ఒక తాటిపై వచ్చి పద్మశాలి బిడ్డలను కాపాడాలని పిలుపునిచ్చారు.