హుజురాబాద్ పట్టణంలో గల టెట్రా ఉన్నత పాఠశాలలో ముందస్తు సంక్రాంతి ముగ్గులు పోటీలను ప్రిన్సిపాల్ నరహరి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో బాలికలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి పాఠశాల డైరెక్టర్ నారాయణ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.