జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో అన్ని మండలాలకు చెందిన రైతు ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 4న జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలన్నారు.