జగిత్యాల జిల్లాలో మేడిపల్లి మండలం కట్లకుంటలో వ్యవసాయ బావిలో ఒకరోజు వయసు ఉన్న మగ శిశువును ఆదివారం గుర్తించారు. మృతి చెంది ఉన్న శిశువు మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. నిన్న వ్యవసాయ బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.