జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేటకు చెందిన భూక్యా మల్లీశ్వరికి మంక్త్యా నాయక్ తండాకు చెందిన ఒక యువకుడితో నిశ్చితార్థం జరిగినది. ఆ యువకుడితో పెళ్లి ఇష్టం లేని మల్లీశ్వరి మనస్తాపానికి గురై శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.