తీన్మార్ మల్లన్న గెలుపుపై జీవన్ రెడ్డి హర్షం

60చూసినవారు
తీన్మార్ మల్లన్న గెలుపుపై జీవన్ రెడ్డి హర్షం
నల్గొండ పట్టభద్రుల శాసనమండలి సభ్యుడిగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) విజయం సాధించడంపై కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు కాంగ్రెస్ కు అండగా నిలిచి తీన్మార్ మల్లన్న విజయంలో భాగస్వాములు అయ్యారన్నారు. చింత పండు నవీన్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్