జగిత్యాల ఆర్టీసి డిపోలో ఆర్టీసి సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జ్ లతో నిరసన తెలుపుతూ విధులకు వెళ్లారు. ఎంతో కాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పే స్కేల్ అమలు చేయాలని, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ తెల్లవారుజామున ఆర్టీసి సిబ్బంది నల్ల బ్యాడ్జ్ లు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.