ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకునికి గాయాలు

76చూసినవారు
ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొని యువకునికి గాయాలు
శంకరపట్నం మండలంలోని రాజాపూర్ గ్రామ సమీపంలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంతో చెట్టుకు ఢీకొనడంతో తలకు గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. ధర్మారంకి చెందిన దేవునూరి అనిల్(25) సోమవారం మొలంగూర్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో రాజాపూర్ సమీపంలో చెట్టుకు ఢీకొని ద్విచక్ర వాహనం నుండి కింద పడిపోయాడు. తలకు గాయమవడంతో స్థానికులు అతడిని 108 అంబులెన్స్ లో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్