ఉపాధి హామీ కూలీల కు దప్పిక తీర్చని అధికారులు

57చూసినవారు
శంకరపట్నం మండలం గద్దపాకలో ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు లేక తల్లడిస్తున్నారు. సుమారు 100 మందీ కూలీలకు ఒక్క 20 లీటర్ల నీళ్లు ఉండడంతో దప్పిక తీర్చుకోలేక తల్లడిల్లుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ లు కూడా అందించడం లేదని, ఎన్నికల ముందు వివిద రాజకీయ పార్టీల వారు తమకు మజ్జిగ ప్యాకెట్లు అందించి కపట ప్రేమ చూపించారని, ఇప్పుడు ఏ ఒక్క నాయకుడు కనీసం మంచినీరు కూడా అందించే వారే లేరని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్