శంకరపట్నం: అంగన్వాడిలో ఫ్రీ స్కూల్ మేళ

572చూసినవారు
శంకరపట్నం: అంగన్వాడిలో ఫ్రీ స్కూల్ మేళ
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో ఐసిడిఎస్ కరీంనగర్ రూరల్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఫ్రీ స్కూల్ మేళ నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల వేషధారణలతో సాంప్రదాయ దుస్తులతో అలంకరించుకొని ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఆరేపల్లి సుమలత, ఎండి సోనీ, బొజ్జ కమల, పద్మ, ఆయాలు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్