దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్

9363చూసినవారు
దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్
రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల లద్నాపూర్ ఓసీపీ -2 వద్ద ఈనెల 5న రాత్రి జరిగిన రాగి వైరు దొంగతనం కేసులో ఇద్దరు నిందితులైన పస్తం తిరుపతి, మోటం అజయ్ లను అరెస్టు చేసినట్లు మంథని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం నాగేపల్లి ఎక్స్ రోడ్ వద్ద రామగిరి ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడినటు వివరించారు. అదుపులోకి తీసుకొని రిమాండ్ కోసం కోర్టుకు పంపించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్