చికెన్ వ్యర్ధాలను విక్రయించొద్దు: కమిషనర్

77చూసినవారు
చికెన్ వ్యర్ధాలను విక్రయించొద్దు: కమిషనర్
చికెన్ సెంటర్ యజమానులు చికెన్ వ్యర్ధాలను విక్రయించొద్దని పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చికెన్ సెంటర్ యజమానులతో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనవసరమైన వ్యర్థాలను ఇటుక బట్టి కార్మికులకు, ఇతరులకు విక్రయించ రాదన్నారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి తహసిల్దార్ రాజ్ కుమార్, ఎస్సై మల్లేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్