ప్రభుత్వ పాఠశాలకు రూ. లక్ష విరాళం

56చూసినవారు
ప్రభుత్వ పాఠశాలకు రూ. లక్ష విరాళం
ఓదెల మండలం మడక గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలకు బుధవారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజున భాష్యం రాఘవులు రూ. లక్ష విరాళం అందజేశారు. గ్రామానికి చెందిన రాఘవులు సుదీర్ఘ కాలం పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైరయ్యారు. ఇటీవలే పరమపదించిన తమ సతీమణి అహల్య పేరిట పాఠశాల అభివృద్ధి కోసం విరాళం అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, ఎంపీటీసీ నోముల పద్మావతి ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్