ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే

63చూసినవారు
ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే
ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం రాత్రి జూలపల్లి మండల కేంద్రంతో పాటు ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు ఆత్మీయ ఇప్తార్ విందును ఏర్పాటు చేశారు. ముస్లిం సోదర, సోదరిమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను ముస్లిం మతపెద్దలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్