సమగ్ర పిల్లల సర్వే ప్రారంభం

66చూసినవారు
సమగ్ర పిల్లల సర్వే ప్రారంభం
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో 0-16 సంవత్సరాల పిల్లల సర్వే ప్రారంభమైంది. మంగళవారం మున్సిపల్ ఆర్పీలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పిల్లల వివరాలు సేకరించారు. పిల్లల కుటుంబ వివరాలు, అసలు పాఠశాలకు వెళుతున్నారా లేదా.? అసలు పాఠశాలకు వెళ్లని వారి వివరాలు సేకరిస్తున్నారు. శనివారం వరకు సర్వేను పూర్తి చేస్తామని మండల విద్యాధికారి సురేందర్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్