మహాత్మా జ్యోతిభా పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి పాల్గొన్నారు.