సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి కు చెందిన చిలుక బుజేందర్ నీరుకుళ్లలో గేదెల కాపరిగా పని చేసేవారు. ఈ నెల 9న తిరుపతిరావు గేదెలను తోలుకెళ్ళి తిరిగి రాలేదు. అతని కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం గట్టెపల్లి శివారులోని ఊరకుంట వద్ద బుజేందర్ మృతదేహం కనిపించింది. చెరువులోకి వెళ్లిన గేదెలను బయటకు తీసుకొచ్చే క్రమంలో కాళ్లకు గుర్రపుడెక్క చుట్టుకొని, ఈత రాక నీటమునిగి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు.