అదనపు ఈవిఎంల తొలిదశ ర్యాండమైజేషన్ పూర్తి

79చూసినవారు
అదనపు ఈవిఎంల తొలిదశ ర్యాండమైజేషన్ పూర్తి
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కోసం అవసరమైన అదనపు ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేశామని పార్లమెంటు రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లో శుక్రవారం అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ అదనపు ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజ్ కుమార్, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్