పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన ఖలీంపాషా అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోగా, అపరేషన్ తప్పనిసరని వైద్యులు తెలిపారు. ఖలీంపాషాకి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా మంజూరైన రూ. లక్ష విలువ గల ఎల్ఓసీ చెక్కును గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు.