సుల్తానాబాద్: అయ్యప్ప ఆలయంలో వైభవంగా అభిషేక మహోత్సవం
సుల్తానాబాద్ మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం ఉదయం స్వామివారి మూల విరాట్టుకు, స్వామి వారికి భక్తులు వైభవంగా అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు సద్దనపు రవీందర్ ఆచార్యుల సారధ్యంలో అయ్యప్ప నామస్మరణ, అష్టోత్తర శతనామావళి, సంకీర్తనలతో స్వామివారికి పంచామృతసహిత ఫలాభిషేకం, అలంకారం, పుష్పార్చన, ధూప దీప నైవేద్యం, మహా హారతి, మంత్రపుష్పం గావించారు.