పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు ప్రత్యేక కృషి: ఎమ్మెల్యే
పెద్దపల్లి పట్టణ సుందరీకరణ కోసం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని 26, 27, 28 వార్డుల్లో ప్యాకేజీ- 9 ద్వారా టీయూ ఎఫ్ఐడిసి నిధులు 1 కోటి 31 లక్షల 97 వేలతో నూతనంగా నిర్మాణాలు చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.