త్యాగధనుల స్మరణలో... శాంతిని నెలకొల్పుదాం: సిపి

65చూసినవారు
త్యాగధనుల స్మరణలో... శాంతిని నెలకొల్పుదాం: సిపి
14 ఏండ్ల స్వరాష్ట్ర ఉద్యమంలో అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని, దశాబ్ద కాలంలో ఘనమైన ప్రగతి సాధించామని, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో సిపి జెండా ఆవిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. పలువురికి ప్రశంస పత్రాలు అందజేసి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్