ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. రైతు చిందు శంకర్ వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడని మంగళవారం కుటుంబ సభ్యులు తెలిపారు. శంకర్‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్, శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు.