ఎల్లారెడ్డిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల ప్రకారం.. మండలంలోని రాచర్ల బొప్పాపూర్కు చెందిన వేముల బాలు (26) తన బైకుపై అతివేగంగా డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తన తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.