పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

63చూసినవారు
పోలీసుల ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్
వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మెడికల్ క్యాంపు ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జూన్ 1వ తేదీన ఉదయం 8 గంటల నుండి నిర్వహించబడునని ఎస్పై రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ క్యాంపులో ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, డెంటల్ సమస్యలు, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్ ఇతర సంబంధిత వైద్యులు అందుబాటులో ఉంటూ పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్