ఆటల పోటీలతో శారీరక, మానసిక వికాసం

54చూసినవారు
ఆటల పోటీలతో శారీరక, మానసిక వికాసం
వీర్నపల్లి మండలం అడవిపదిరలో నెల రోజులుగా కొనసాగుతున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. జిల్లాలోని 30 జట్లు పోటీలో హోరాహోరీగా తలపడ్డాయి. అడవిపదిర జట్టుపై వీర్నపల్లి జట్టు విజయం సాధించింది. గెలుపొందిన జట్లకు అతిధుల చేతుల మీదుగా ప్రోత్సాహక నగదుతో పాటు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు లక్ష్మిరాజం, దినకర్, ఎంపీటీసీ సభ్యుడు అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్