ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఖండాంతరాలు దాటాయి. అమెరికాలోని మిచిగాన్ స్టేట్ లోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ విప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ యూత్ సభ్యులు ఎమ్మెల్యేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు అభిమానులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.