మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

1902చూసినవారు
మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
వచ్చే నెల 7 నుండి 9వ తేదీ వరకు నిర్వహించే శివరాత్రి జాతర సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలో అదనపు కలెక్టర్ గౌతమితో కలిసి కలెక్టర్ పర్యటించారు. శివరాత్రి జాతర ఏర్పాట్లను, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్