దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గుడిలో ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో ప్రత్యేక పూజలు నిర్వహించి సేవలో తరించారు. అందరిని చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం వేడుకున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో భక్తజనం వేచి చూశారు.