ఘనంగా ఉగాది పండుగ వేడుకలు

69చూసినవారు
ఘనంగా ఉగాది పండుగ వేడుకలు
కథలాపూర్ మండలం లోని సిరికొండ గ్రామంలో మంగళవారం రోజున తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామీ దేవస్థానం, శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో ఉగాది మహోత్సవం నిర్వహించారు. షడ్రుచుల మిళితమైన పచ్చడిని వితరణ చేశారు. ఆచార్యులు సోమసూత్రం విశ్వనాథం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఈశ్వరునికి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్