ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు మృతి చెందడం బాధాకరం

79చూసినవారు
ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు మృతి చెందడం బాధాకరం
కోనరావుపేట మండలం కేంద్రానికి చెందిన కొలకాని నవీన్(19) యువకుడు ఇటీవల తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. శనివారం బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు. వారి వెంట మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, నాయకులు అరె మహేందర్, శివతేజరావు, యాస రాజం తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్