నిందితుని వేములవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో 18వ తేదీన రషిద్ హత్యను నూనె మనోహర్ అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి శనివారం పట్టణ పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితున్ని పట్టుకొని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పట్టుకున్న సిబ్బందిని అభినందించారు.