గత కొన్ని సంవత్సరాల నుండి కబడ్డీలో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రాణిస్తున్న అనుపురం గ్రామానికి చెందిన యువ కబడ్డీ క్రీడాకారులకు టీ షర్టులను కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రెటరీ వనపట్ల ప్రభాకర్ రెడ్డి ఆదివారం అందజేశారు. క్రీడాలతో మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కబడ్డీ క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.