కూతురి కష్టాలను తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో విషాదం జరిగింది. కూతురి కష్టాలను తట్టుకోలేక ఓ తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం స్థానికుల ప్రకారం తెలిపిన వివరాలు ప్రకారం.. రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన శ్రీనివాస్ (50) కూతురు రమ్యను 11 ఏళ్లక్రితం సిరిసిల్ల రాజునగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో పెళ్లి చేశాడు. తన కూతురిని అల్లుడు చిత్ర హింసలు పెడుతున్నాడని మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.