ధర్మపురి
ధర్మారంలో ఇస్త్రీ షాపు దగ్ధం
ధర్మారం మండల కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద గల ఇస్త్రీ షాపులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. షాపులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న విలువైన బట్టలు, ఇతర సామాగ్రి అన్ని దగ్ధమయ్యాయి. దీంతో షాపు నిర్వాహకుడు మల్యాల రాజేశం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. షాపు కాలిపోవడంతో తన జీవనాధారం కోల్పోయానని తెలిపాడు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నాడు.