వేములవాడ
గుండెపోటుతో రైతు మృతి
కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో పుల్లూరి రవి గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవి ఎప్పటిలాగా పొలం వద్దకు వెళ్లి ఇంటికి వచ్చి ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులతో తెలపడంతో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో గుండెపోటుతో చనిపోయాడని తెలిపారు.