తల్లిదండ్రుల బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్

22156చూసినవారు
తల్లిదండ్రుల బాధను చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్
దీప, కార్తీక్‌లు ఓ హోటల్ లో పని చేస్తున్న విషయం తెలిసిందే కదా. మరోవైపు సౌందర్య, ఆనందరావులు కూడా కార్తీక్ వాళ్లు ఉన్న గ్రామంలోనే ఉన్నారు. దీంతో కథనం రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ఇంట్లో గ్యాస్ అయిపోతే దీప రుద్రాణి ఇంటికి వెళ్లి అక్కడే వంట చేసుకుని, పిల్లల జోలికి రావద్దు అంటూ రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది.

ఇక నేటి 1251వ ఎపిసోడ్‌ హైలైట్స్ ని ఒకసారి చూద్దాం. దీప పిండి వంటలు చేస్తూ ‘గ్యాస్ అయిపోయింది.. హోటల్‌లో అప్పారావుని అడగాలి’ అనుకుంటుంది. అప్పటికే హోటల్లో పనికి వెళ్లిన కార్తీక్‌‌‌ తో అప్పారావు రుద్రాణి ఇంట్లో ఒక పార్సిల్, ఒకటి ప్రకృతి వైద్యశాలలో ఇవ్వాలని చెబుతాడు. తాడికొండలో ఉండాలంటే ఆ రుద్రాణితో బాగా ఉండాలి బావో అని కార్తీక్ కి జాగ్రత్త చెబుతాడు. కార్తీక్ తలాడించి సైకిల్ తీస్తాడు. అప్పుడే దీప హోటల్ వైపు వస్తూ ఉంటుంది. ‘అప్పరాావు.. నాకో గ్యాస్ సిలిండర్ కావాలి.. ఖాళీ సిలిండర్ ఉంది’ అంటాడు కార్తీక్. ‘సరే బా.. ఇస్తాను తీసుకుని వెళ్దువు గానీ.. నువ్వు జాగ్రత్తగా పార్సిల్ ఇచ్చేసిరా’ అంటూ కార్తీక్‌ ని పంపిస్తాడు. కార్తీక్ అలా వెళ్లగానే దీప వచ్చి ‘నాకో గ్యాస్ సిలిండర్ కావాలి అప్పారావ్.. అందుకే వచ్చాను’ అంటే ‘అయ్యో అక్కా.. ఛా.. ఇప్పుడే నేనే ఒకరికి మాటిచ్చా.. రేపు సర్దుతాను అక్కా.. ఈ రోజంటే కష్టం’ అని అంటాడు.

ఇక సీన్ కట్ చేస్తే.. కార్తీక్ సైకిల్ ప్రకృతి వైద్యశాలకు వెళ్తాడు. పార్సిల్ ఆర్డర్ ఇచ్చారండీ అని అక్కడ పని చేవారిని అడుగుతాడు. ‘లోపల కుడివైపు రెండో గది అని చెబుతారు. అప్పుడే కార్తీక్.. లోపలకి నడుస్తుంటే సౌందర్య ‘వేడి నీళ్లు తెస్తాను.. మీరు పడుకోండి’ అంటూ బయటికి వెళ్తుంది. ఆనందరావు పడుకుంటాడు. సౌందర్య అలా వెళ్లగానే కార్తీక్ అదే రూమ్‌లోకి వచ్చి తండ్రి మంచంపై పడుకోవడం చూసి షాక్ అవుతాడు. ‘ఏం అయ్యింది డాడీకి.. నా గురించి బెంగపడి ఇలా అయిపోయారా?’ అనుకుంటూ పార్సిల్ అక్కడ పెడతాడు. ఇంతలో సౌందర్య రావడం చూసి తలుపు వెనక్కి వెళ్తాడు.

సౌందర్య ఆనందరావుని నిద్రలేపి భోజనం చేసి పడుకోండి అని అంటుంది. నాకు ఆకలిగా లేదని ఆనందరావు అంటాడు. అప్పుడే కార్తీక్ వాళ్ల ఉన్న గది దగ్గర మాటలు విని ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే.. మోనిత తన లవ్ స్టోరీ మొత్తం ట్విస్ట్‌లతో తన దగ్గరకు పని చేయడానికి వచ్చిన విన్నీతో చెబుతుంది. అంతా విన్న విన్నీ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మరోవైపు హిమ, సౌర్య స్కూల్లో ఆడుకుంటూ ఉండగా రుద్రాణి మనుషులు లంచ్ బాక్స్ పట్టుకుని వస్తారు. రుద్రాణి అక్కా మీకు లంచ్ పంపించింది.. తినండి అని అంటారు. కాసేపటికి ఆ బాక్స్‌లు ముందు కొంత మంది పిల్లలు తింటూ కనిపిస్తారు. హిమ, సౌర్య ఇద్దరూ రౌడీల కంటపడకుండా తప్పించుకుని బ్యాగ్స్ తీసుకుని ఇంటికి వెళ్లిపోతారు. రౌడీలు వేరే పిల్లలు తినడం చూసి షాక్ అయిపోతారు. హిమ, సౌర్యలు మాత్రం ఇంటికి వచ్చి తల్లికి జరిగింది చెప్పి ఏడుస్తారు. మరిన్ని వివరాలు తరువాయి ఎపిసోడ్ లో చూద్దాం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్