తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ఇసుజు కారు నడుపుతూ కనిపించారు. కారులో కేసీఆర్‌తో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నారు. అలాగే వెనక సీటులో పలువురు BRS పార్టీ నేతలు కూర్చున్నారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ కారు నడపడంతో.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.