అల్లు అర్జున్ ఫ్రెండ్, టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తేలిసిందే. కేదార్ మృతిపై సీఎం రేవంత్ స్పందించారు. KTR వ్యాపార భాగస్వామి కేదార్ అనుమానాస్పదంగా చనిపోయారని అన్నారు. ర్యాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో కేదార్ నిందితుడని, ఈ అనుమానాస్పద మరణాలపై KTR ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. అనుమానాస్పద మరణాలపై జ్యుడీషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని తెలిపారు.