కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి.. వీడియో

58చూసినవారు
TG: విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ కిచక ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో విద్యార్థుల పేరెంట్స్ పాఠశాలకు రాగా.. సదరు ఉపాధ్యాయుడు గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. వెంటనే అతడిని పట్టుకొని రోడ్డుపై చెప్పులతో చితకబాదారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్