బీచ్‌లో యోగా చేస్తూ రష్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ (24) మృతి చెందారు. థాయిలాండ్‌లో పర్యటిస్తున్న ఆమె సుముయ్ ద్వీపం వద్దకు వెళ్లి ఓ రాయిపై కూర్చుని యోగా చేస్తోంది. ఓ పెద్ద అల కెమిల్లాపై పడి.. సముద్రంలోకి లాక్కెళ్లింది. కొన్ని గంటల తర్వాత ఆమె శవమై ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కెమిల్లా నటుడు లారెన్స్ తెరకెక్కించిన కాంచన-3 సినిమాలో నటించారు. దీంతో ఆమె మృతిపై దక్షిణాదికి చెందిన సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.